Monday, November 12, 2018

Dosa Batter recipe preparation in Telugu | Dosa Pindi preparation for Crispy dosa

DOSA BATTER PREPARATION TO GET HOTEL STYLE TASTY AND CRISPY DOSA



దోస పిండి ఇలా ట్రై చేసి చూడండి దోస లు చాలా టేస్టీగా ఉంటాయి.. 



కావలసిన పదార్థాలు :


బియ్యం                 :  రెండు కప్పులు
మినప్పప్పు           :   ఒక కప్పు
మెంతులు             :   ఒక చిన్న స్పూను
నీళ్లు                       :   తగినన్ని


ముందుగా చేయాల్సినవి :



  • బియ్యంని మినప్పప్పు ని మెంతులని ఒక గిన్నె లో తీసుకొని వాటిని మంచి నీటితో రెండు నుంచి మూడు సార్లు నీళ్లు మారుస్తూ కడిగి పెట్టుకోవాలి. 
  • ఇప్పుడు ఈ మూడింటిని ఒక ఎనిమిది గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అంటే ఉదయం నానబెడితే రాత్రి కి పిండి ని సిద్ధం చేసుకొని పెట్టుకొని మరుసటి రోజు దోస లు వేస్కోవచ్చు. 

తయారు చేసే విధానం :


నానబెట్టుకున్న బియ్యం మినప్పప్పు ఇంకా మెంతులని ఒక మిక్సీ లేదా గ్రైండర్ లో వేస్కొని అందులో ఇందాక బియ్యం నానబెట్టుకున్న నీటిని కొంచం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 
అలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి ని ఒక గిన్నె లో తీసుకొని దాని పైన మూత లేదా ఏదైనా బట్ట ని చుట్టి రాత్రంతా పెట్టుకుంటే మరుసటి రోజు కి పిండి పులిసి మంచి దోస లు వేస్కోవచ్చు.

దోస లు మంచి కలర్ రావాలి అంటే దోస పిండి గ్రైండ్ చేస్కునే అప్పుడు అందులో కొంచం అన్నం వేసుకొని గ్రైండ్ చేస్తే మంచిగా బ్రౌన్ కలర్ లో వస్తాయ్ దోస లు. 


ఈ దోస పిండి తో ఎన్నో వెరైటీ దోస లు వేసి మీ ఇంట్లో వాళ్ళని ఆనంద పెట్టండి. 


ధన్యవాదాలు 😊

Sunday, November 11, 2018

How to make French Fries at home easily | Snack recipe French Fries ela cheyali

Tasty Snack Recipe French Fries Preparation at Home in Telugu

ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయు విధానం 


కావలసిన పదార్థాలు :   

ఆలూ / పొటాటో : రెండు 
ఉప్పు                  : 2 టీ స్పూన్లు / రుచికి సరిపడా 
నీళ్ళు                  : 4 గ్లాసులు 
నూ నె                  : డీప్ ఫ్రై కి సరిపడా 

ముందుగా చేయాల్సినవి :

  • ఆలూ గడ్డలని శుభ్రంగా నీళ్లలో కడిగి పైన ఉన్న చెక్కుని తీయాలి. అలా తీసిన ఆలూ లని ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలో పోగవుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీటి లో వేసుకోవాలి. ఇలా చెయ్యకపోతే ఆలూ పీసెస్ అన్నీ రంగు మారిపోతాయి. 
  • ఇప్పుడు ఈ ఆలూ ముక్కలని మంచి  నీళ్లలో వేసి రెండు మూడు సార్లు నీళ్లు మారుస్తూ శుభ్రం చేసుకోవాలి. 
  • తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె లో నాలుగు గ్లాసులు నీళ్లు వేసి అందులో రెండు టీ స్పూన్లు ఉప్పు వేసి మూత పెట్టాలి . 
  • నీళ్లు బాగా మరుగుతున్న సమయం లో ఆలూ ముక్కలని వేసి ఒక అయిదు నిముషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 
  • ఆలూ ఎక్కువ ఉడకకూడదు కొంచం బాయిల్ అయితే చాలు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లగా అయ్యేవరకు పెట్టుకోవాలి . 
  • ఫైనల్ గా ఈ ఉడికించిన ఆలూ ముక్కలని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి .  ఇలా చెయ్యడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీ గా వస్తాయి. 

తయారీ విధానం :


 ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని నూనె కొంచం వేడయ్యాక ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసిన ఆలూ పీసెస్ ని వేసి కొంచం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచం ఫ్రై అవ్వగానే తీసేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి . ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్న ఆలూ ఫ్రైస్ ని ఆయిల్ లో వెస్కొని ఇంకోసారి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి . 

ఫైనల్ గా వేడి వేడి గా ఎంతో క్రిస్పీ గా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినట్టే. వీటిని ఒక ప్లేట్ లో తీస్కొని కావాలి అంటే పైన కొంచం చాట్ మసాలా చల్లుకొని సర్వ్ చేస్కోవచ్చు . 


ఈ రెసిపీ మీకు నచ్చుతుందని ఆసిస్తూ.... 

ధన్యవాదాలు 😊





Saturday, November 10, 2018

Semiya Payasam recipe preparation in Telugu | How to prepare Yummy yummy Kheer

ఎంతో రుచికరమైన సేమియా పాయసం తయారీ విధానం 


కావలసిన పదార్థాలు :

సేమ్యా లు             : ఒక కప్పు
పాలు                      : మూడు కప్పులు
పంచదార              : ఒక కప్పు
జీడీ పప్పు              : ఎనిమిది
బాదం                     : అయిదు
ఎండు  ద్రాక్ష         : పది
యాలకుల పొడి    : ఒక టీ స్పూను
నెయ్యి                    : నాలుగు టేబుల్ స్పూన్లు 


ముందుగా చేయాల్సినవి :

  • ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో పాలు పోసి పొయ్యి మీద తక్కువ మంట  మీద వేడి చేసుకోవాలి . పాలు పొంగు తున్నపుడు కొంచం మంట తగ్గిస్తూ గరిట తో కలుపుతూ కాసేపు ఉంచలి . పాలు బాగా కాగి కొంచం చిక్కపడే దాక ఉంచితే సరిపోతుంది. ఇలా చేయడం వాళ్ళ మంచి టేస్ట్ వస్తుంది పాయసంకి . 
  • ఇప్పుడు ముందుగా తీసుకున్న బాదాం ఇంకా జీడిపప్పు లను చిన్న గా కట్ చేసుకొని పెట్టుకోవాలి . 


తయారు చేయు విధానం :

ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు  స్పూన్ల నెయ్యి వేయాలి . నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్ బాదం విడి విడి గా వేసి వీయించి కొంచం రంగు మారాక తీసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు అదే  పాన్ లో మిగతా నెయ్యి వేసి అందులో సేమియా ని వేసి సిం లో పెట్టుకొని కొంచం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించా లి . తరువాత వేయించిన సేమ్యా ని వేరే గిన్నె లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్యా వీయించి తీసిన గిన్నె లో  ముందు గా వేడి చేసుకొని పెట్టుకున్న పాలను పోయాలి. పాలు కొంచం వేడయ్యాక అందులో వేయించి పెట్టుకున్న సేమియా వేసి మీడియమ్ మంట  పెట్టుకొని మధ్య మధ్య లో కలుపుతూ ఉడికించుకోవాలి . సేమియా ఉడికిన తర్వాత అందులో పంచదార వేసి జాగ్రత్త గా కలుపుకోవాలి . కాసేపు సిం లో పెట్టి పంచదార మొత్తం కరిగిన తర్వాత యాలకుల పొడి వేసికొని చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదాం కిస్మిస్ లను వేసి ఒకసారి కలిపి అందులో కొంచం నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 

కొంచం చల్లగా అయ్యాక మీ ఫామిలీ మెంబెర్స్ కి చిన్న చిన్న బౌల్స్ లో వేసి ఇచ్చారు అంటే వాళ్ళు ఎంతో హ్యాపీ గా తిని మిమ్మల్ని మెచ్చుకుంటారు . 

చాలా సింపుల్ గా త్వరగా చేసుకోగలిగిన ఈ పాయసం ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చెయ్యండి . 


ధన్యవాదాలు😊