Tasty Snack Recipe French Fries Preparation at Home in Telugu
ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయు విధానం
కావలసిన పదార్థాలు :
ఆలూ / పొటాటో : రెండు
ఉప్పు : 2 టీ స్పూన్లు / రుచికి సరిపడా
నీళ్ళు : 4 గ్లాసులు
నూ నె : డీప్ ఫ్రై కి సరిపడా
ముందుగా చేయాల్సినవి :
- ఆలూ గడ్డలని శుభ్రంగా నీళ్లలో కడిగి పైన ఉన్న చెక్కుని తీయాలి. అలా తీసిన ఆలూ లని ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలో పోగవుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీటి లో వేసుకోవాలి. ఇలా చెయ్యకపోతే ఆలూ పీసెస్ అన్నీ రంగు మారిపోతాయి.
- ఇప్పుడు ఈ ఆలూ ముక్కలని మంచి నీళ్లలో వేసి రెండు మూడు సార్లు నీళ్లు మారుస్తూ శుభ్రం చేసుకోవాలి.
- తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె లో నాలుగు గ్లాసులు నీళ్లు వేసి అందులో రెండు టీ స్పూన్లు ఉప్పు వేసి మూత పెట్టాలి .
- నీళ్లు బాగా మరుగుతున్న సమయం లో ఆలూ ముక్కలని వేసి ఒక అయిదు నిముషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
- ఆలూ ఎక్కువ ఉడకకూడదు కొంచం బాయిల్ అయితే చాలు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లగా అయ్యేవరకు పెట్టుకోవాలి .
- ఫైనల్ గా ఈ ఉడికించిన ఆలూ ముక్కలని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి . ఇలా చెయ్యడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీ గా వస్తాయి.
తయారీ విధానం :
ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని నూనె కొంచం వేడయ్యాక ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసిన ఆలూ పీసెస్ ని వేసి కొంచం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచం ఫ్రై అవ్వగానే తీసేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి . ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్న ఆలూ ఫ్రైస్ ని ఆయిల్ లో వెస్కొని ఇంకోసారి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి .
ఫైనల్ గా వేడి వేడి గా ఎంతో క్రిస్పీ గా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినట్టే. వీటిని ఒక ప్లేట్ లో తీస్కొని కావాలి అంటే పైన కొంచం చాట్ మసాలా చల్లుకొని సర్వ్ చేస్కోవచ్చు .
ఈ రెసిపీ మీకు నచ్చుతుందని ఆసిస్తూ....
ధన్యవాదాలు 😊
No comments:
Post a Comment