DOSA BATTER PREPARATION TO GET HOTEL STYLE TASTY AND CRISPY DOSA
దోస పిండి ఇలా ట్రై చేసి చూడండి దోస లు చాలా టేస్టీగా ఉంటాయి..
కావలసిన పదార్థాలు :
బియ్యం : రెండు కప్పులు
మినప్పప్పు : ఒక కప్పు
మెంతులు : ఒక చిన్న స్పూను
నీళ్లు : తగినన్ని
ముందుగా చేయాల్సినవి :
- బియ్యంని మినప్పప్పు ని మెంతులని ఒక గిన్నె లో తీసుకొని వాటిని మంచి నీటితో రెండు నుంచి మూడు సార్లు నీళ్లు మారుస్తూ కడిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఈ మూడింటిని ఒక ఎనిమిది గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అంటే ఉదయం నానబెడితే రాత్రి కి పిండి ని సిద్ధం చేసుకొని పెట్టుకొని మరుసటి రోజు దోస లు వేస్కోవచ్చు.
తయారు చేసే విధానం :
నానబెట్టుకున్న బియ్యం మినప్పప్పు ఇంకా మెంతులని ఒక మిక్సీ లేదా గ్రైండర్ లో వేస్కొని అందులో ఇందాక బియ్యం నానబెట్టుకున్న నీటిని కొంచం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి ని ఒక గిన్నె లో తీసుకొని దాని పైన మూత లేదా ఏదైనా బట్ట ని చుట్టి రాత్రంతా పెట్టుకుంటే మరుసటి రోజు కి పిండి పులిసి మంచి దోస లు వేస్కోవచ్చు.
దోస లు మంచి కలర్ రావాలి అంటే దోస పిండి గ్రైండ్ చేస్కునే అప్పుడు అందులో కొంచం అన్నం వేసుకొని గ్రైండ్ చేస్తే మంచిగా బ్రౌన్ కలర్ లో వస్తాయ్ దోస లు.
ఈ దోస పిండి తో ఎన్నో వెరైటీ దోస లు వేసి మీ ఇంట్లో వాళ్ళని ఆనంద పెట్టండి.