ఎంతో రుచికరమైన సేమియా పాయసం తయారీ విధానం
కావలసిన పదార్థాలు :
సేమ్యా లు : ఒక కప్పు
పాలు : మూడు కప్పులు
పంచదార : ఒక కప్పు
జీడీ పప్పు : ఎనిమిది
బాదం : అయిదు
ఎండు ద్రాక్ష : పది
యాలకుల పొడి : ఒక టీ స్పూను
నెయ్యి : నాలుగు టేబుల్ స్పూన్లు
పాలు : మూడు కప్పులు
పంచదార : ఒక కప్పు
జీడీ పప్పు : ఎనిమిది
బాదం : అయిదు
ఎండు ద్రాక్ష : పది
యాలకుల పొడి : ఒక టీ స్పూను
నెయ్యి : నాలుగు టేబుల్ స్పూన్లు
ముందుగా చేయాల్సినవి :
- ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో పాలు పోసి పొయ్యి మీద తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి . పాలు పొంగు తున్నపుడు కొంచం మంట తగ్గిస్తూ గరిట తో కలుపుతూ కాసేపు ఉంచలి . పాలు బాగా కాగి కొంచం చిక్కపడే దాక ఉంచితే సరిపోతుంది. ఇలా చేయడం వాళ్ళ మంచి టేస్ట్ వస్తుంది పాయసంకి .
- ఇప్పుడు ముందుగా తీసుకున్న బాదాం ఇంకా జీడిపప్పు లను చిన్న గా కట్ చేసుకొని పెట్టుకోవాలి .
తయారు చేయు విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేయాలి . నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్ బాదం విడి విడి గా వేసి వీయించి కొంచం రంగు మారాక తీసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు అదే పాన్ లో మిగతా నెయ్యి వేసి అందులో సేమియా ని వేసి సిం లో పెట్టుకొని కొంచం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించా లి . తరువాత వేయించిన సేమ్యా ని వేరే గిన్నె లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్యా వీయించి తీసిన గిన్నె లో ముందు గా వేడి చేసుకొని పెట్టుకున్న పాలను పోయాలి. పాలు కొంచం వేడయ్యాక అందులో వేయించి పెట్టుకున్న సేమియా వేసి మీడియమ్ మంట పెట్టుకొని మధ్య మధ్య లో కలుపుతూ ఉడికించుకోవాలి . సేమియా ఉడికిన తర్వాత అందులో పంచదార వేసి జాగ్రత్త గా కలుపుకోవాలి . కాసేపు సిం లో పెట్టి పంచదార మొత్తం కరిగిన తర్వాత యాలకుల పొడి వేసికొని చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదాం కిస్మిస్ లను వేసి ఒకసారి కలిపి అందులో కొంచం నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
కొంచం చల్లగా అయ్యాక మీ ఫామిలీ మెంబెర్స్ కి చిన్న చిన్న బౌల్స్ లో వేసి ఇచ్చారు అంటే వాళ్ళు ఎంతో హ్యాపీ గా తిని మిమ్మల్ని మెచ్చుకుంటారు .
చాలా సింపుల్ గా త్వరగా చేసుకోగలిగిన ఈ పాయసం ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చెయ్యండి .
ధన్యవాదాలు😊
Nice explanation madam
ReplyDelete